చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 280 పరుగుల తేడాతో బంగ్లాని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ బ్యాటు, బాల్ తో సత్తా చాటాడు. 515 రన్స్ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా 234 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ బంగ్లాని తిప్పేశాడు. ఆరు వికెట్లుతో ఆదరగొట్టాడు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్ లో అశ్విన్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 149 పరుగులకే ఆలౌటైంది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 287/4 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతోపాటు ఆరు వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత సాధించాడు.
అలాగే ఈ మ్యాచ్ తో టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్ల జాబితాలో 8వ స్థానంలో ఉన్న కోట్నీ వాల్ష్‌ను వెనక్కి నెట్టేశాడు అశ్విన్. ఇప్పటి వరకు 519 వికెట్లతో ఈ స్థానంలో ఉన్న కరేబియన్ బౌలర్ ఇప్పుడు తొమ్మిదో స్థానానికి పరిమితం అయ్యాడు.