కుక్కల విద్యాసాగర్ ను.. డెహ్రాడూన్లో అరెస్టు చేసి రైలు మార్గంలో విజయవాడకు తీసుకు వచ్చారు. కోర్టులో హాజరు పరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. కస్టడీకి తీసుకుని పోలీసులు అసలు కథ ఏంటో బయట పెట్టనున్నారు. ఇప్పటికే జరిగిన కథ మొత్తం పోలీసుల దగ్గర ఉంది. సాక్ష్యాలను కూడా రెడీ చేసి పెట్టారు. ఈ కేసులో అసలు కథ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుతో ప్రారంభమయింది కాబట్టి.. చిక్కుముళ్లను కూడా అక్కడ్నుంచే విప్పబోతున్నారు.,
జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. న్యూడ్ ఫోటోలు కూడా పంపాడు. అయితే అసలు ఈ టాపిక్ కన్నా.. తప్పుడు కేసు ఎందుకు పెట్టారు.. ఎందుకు.. తప్పుడు ఫోర్జరీలు సృష్టించారు…ముగ్గురు పోలీసు అధికారులతో చేసిన చర్చలేంటి ?. సీఎంవోకు పదే పదే ఎందుకెళ్లారు వంటి అసలు వ్యవహారాలను ఆయన ద్వారా బయట పెట్టించనున్నారు. కుక్కల విద్యాసాగర్ తన ఫిర్యాదులో ఓ వ్యక్తి పేరును చెప్పి.. అతనికి జెత్వానీ తన భూమిని అమ్మబోయిందని చెప్పారు. ఆ వ్యక్తి ఇప్పటికే తనకు ఎవరూ భూమి అమ్మే ప్రయత్నం చేయలేదని… తాను ఎవరికీ డబ్బులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అంటే కేసే లేదు.. ఐదు లక్షల సాకుతో ఆమె కుటుంబం మొత్తాన్ని అరెస్టు చేసి తీసుకొచ్చి వేధించారు.
ఈ కేసులో ఇప్పటికే కొన్ని ఆర్థిక లావాదేవీలనూ బయటకు తీశారు. ఓ పారిశ్రామికవేత్త నుంచి కుక్కల విద్యాసాగర్ కు… బాగానే ముట్టాయని.. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన వారు.. తప్పుడు కేసులు పెట్టిన వారికి.. ఖరీదైన కార్లు, ఇతర బహుమతులు అందాయని గుర్తించారు. కుక్కల విద్యాసాగర్ కస్టడీలో అన్నింటినీ బయటకు తీసి… కీలక వ్యక్తుల్ని నిందితులుగా చూపించి అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోది.