హైడ్రా కూల్చివేతల సమయంలో కొంత మంది ఆవేదనలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చడం లేదని చెబుతున్నారు కానీ.. కొంత మంది తమకు సామన్లు తీసుకునే చాన్స్ కూడా ఇవ్వడం లేదని మీడియా ముందు చెబుతున్నారు. కానీ హైడ్రా అధికారులు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. కిష్టారెడ్డిపేటలో కూల్చివేసి ఓ ఆస్పత్రిని వారం రోజుల కిందటే… గతంలో ఎక్కడ నిర్వహించారో అక్కడికే తరలించుకున్నారు. ఆ తర్వాత కూల్చివేశారు. అంటే సమయం ఇచ్చినట్లే. అందుకే కావాలని కొంత మంది చేయిస్తున్న రచ్చను నమ్మవద్దని హైడ్రా అధికారులు కోరుతున్నారు.
రేపోమాపో ఆపరేషన్ బుడమేరును ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఆక్రమణలు గుర్తించారు. వాటిని కూల్చివేయడం ఖాయం. అప్పుడు కూడా ఇలాంటి సీన్లు కనిపిస్తాయి. అప్పుడు కూడా ఇలా కూల్చివేతలు చేయడం సమంజసం కాదని కొంత మంది ఏడుపులతో ముందుకు రావొచ్చు. జరిగినదంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి కాబట్టి.. వారు చేసే డ్రామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
కానీ.. బుడమేరు ఆక్రమణల వల్ల జరిగిన నష్టంతో పోలిస్తే.. మరోసారి బుడమేరు నుంచి అలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే.. ఖచ్చితంగా ఆపరేషన్ బుడమేరు చెపట్టాల్సిందే. సీఎం చంద్రబాబు కూడా అదే లక్ష్యంతో ఉన్నారు. అయితే నిజంగా బాధితులైన వారి కోసం ఏదో ఓ చర్యులు తీసుకోవాల్సి ఉంటుంది. కబ్జా చేసి అమ్ముకున్న వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి.. కొనుగోలు చేసిన వారికి పరిహారం ఇప్పించే ఏర్పాట్లు చేస్తే కొంత వరకూ బాధితులు కాస్త రిలీఫ్ ఫీలయ్యే అవకాశం ఉంది.