నారా రోహిత్ సినిమా తుంటరి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తుంటరికి యావరేజ్ టాక్ రావడం, రివ్యూలు కూడా వన్ టైమ్ వాచ్ మూవీగా డిక్లేర్ చేయడం, మిగిలిన సినిమాలన్నీ బోర్లా పడడం, బాక్సాఫీసు దగ్గర పెద్దగా పోటీ లేకపోవడంతో కాసిన్ని వసూళ్లు రాబట్టుకొంటోంది. తొలి మూడు రోజుల్లో రూ.8 కోట్ల గ్రాస్ దక్కించుకొంది తుంటరి. శుక్రవారం, శనివారం వరుసగా రూ.2.5 కోట్లు వసూలు చేసిన తుంటరి.. ఆదివారం రూ.3 కోట్లు రాబట్టింది.
షేర్ లెక్కేస్తే రూ.5.5 కోట్ల వరకూ ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. మల్టీప్లెక్స్‌లలో తుంటరికి బాగానే టికెట్లు తెగడంతో వీకెండ్లో కొన్నివసూళ్లు దండుకొంది. మొత్తమ్మీద తుంటరి సేఫ్ ప్రోజెక్టే అన్నది ఫిల్మ్‌నగర్ సమాచారం. రూ.7 కోట్లతో ఈ సినిమాపూర్తయ్యింది. శాటిలైట్ కలుపుకొంటే స్వల్ప నష్టాలతో గట్టెక్కేసే ఛాన్సుంది. ఇదే నెలలో రోహిత్ సినిమా సావిత్రి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆసినిమాపై మాత్రం నారా వారి అబ్బాయి బోలెడు ఆశలు పెట్టుకొన్నాడు. ఈసారి మాత్రం భారీ లాభాలు రావడం ఖాయం అంటున్నాడట. మరి సావిత్రి ఏం చేస్తుందో చూడాలి.