ఇటీవల జరిగిన వరంగల్, ఖమ్మం మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో అధికార తెరాస పూర్తి మెజార్టీతో గెలుచుకొన్న సంగతి అందరికీ తెలిసిందే. నగరపాలక కమీషనర్ వేణుగోపాలరెడ్డి కొత్తగా ఎన్నికయిన కార్పోరేటర్లతో ప్రమాణస్వీకారం చేయించిన తరువాత వారు ఖమ్మం నగర మేయర్ గా డాక్టర్ పాపాలాల్ , డిప్యూటీ మేయర్ గా బత్తులు మురళి ఏకగ్రీవంగా ఎననుకొన్నారు. వారిచేత జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. అదే విధంగా వరంగల్ మేయర్ గా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్ గా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.