ప్రవీణ్ సత్తారు తీసిన గుంటూరు టాకీస్‌కి ‘బూతు సినిమా’ అనే ట్యాగ్ లైన్ పడిపోయింది. ఏ సర్టిఫికెట్ కోసమే అన్నట్టుగా సన్నివేశాల్లో మసాలా కావల్సిన దానికంటే ఎక్కువే దట్టించాడు ప్రవీణ్ సత్తారు. అంతకు ముందు తీసిన సినిమాలు విమర్శకుల ప్రసంశలు అందుకొంటే… ఈసారి డబ్బులు దండుకోవడమే ధ్యేయంగా సినిమా తీశాడా అనిపించింది. అనుకొన్నట్టుగానే బీ, సీ సెంటర్లలో గుంటూర్ టాకీస్‌కి టికెట్లు బాగానే తెగాయి. ఇప్పటి వరకూ దాదాపు గా రూ. 6కోట్ల గ్రాస్ అందుకొంది ఈ చిత్రం. ఓవరాల్‌గా షేర్ రూ.4 కోట్ల వరకూ వచ్చిందట. నిజానికి రెండున్నర కోట్లలో ఈ సినిమా ముగించాడు ప్రవీణ్. దాన్ని నాలుగు కోట్లకు టేబుల్ ప్రాఫిట్‌కి అమ్ముకొన్నాడు. అంటే కోటిన్నర లాభం. ఇంకా శాటిలైట్ ఉందాయె. అది హీనపక్షం కోటి రూపాయలు వచ్చినా రెండున్నర కోట్ల లాభం అందుకొన్నట్టే. అంటే రూపాయికి రూపాయి వచ్చినట్టే. ఇక ఎంతమంది బూతు సినిమా అని ముద్రవేసినా… ఏముంది? ఇన్ని డబ్బులు సంపాదించుకొన్నాక.? ప్రవీణ్ ఇప్పుడు హ్యాపీయేనా?