వైసీపీ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ కు సంబంధించి ఇవాళ సుప్రీమ్ కోర్టు లో కీలకమైన తీర్పు వచ్చింది. ఈ విషయాన్ని ఆమె హైకోర్టు లొనే తేల్చుకోవలంటూ సుప్రీమ్ ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ బడ్జెట్ సమావేశాలకు తానూ హజరయ్యేలా చూడాలంటూ రోజా తన పిటిషన్ లో కోరిన నేపధ్యంలో ఆమె కేసును తక్షణం అంటే.. బుధవారం నాడే విచారణ కు చేపట్టాలని కూడా సుప్రీం ఆదేశించడం విశేషం. సుప్రీం తీర్పు తనకు అనుకూలంగా వచ్చినదంటూ రోజా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడమూ, ఆమె సంతోషాన్ని చూసి.. అందరూ సుప్రీం లో రోజాకు ఊరట లభించిందంటూ వ్యాఖ్యలు చేసేయడమూ జరిగింది. అయితే కాస్త లోతుగా వెళ్లి ఆలోచిస్తే.. అసలు రోజా సాధించింది ఏమి లేదని అర్ధం అవుతుంది. ఆమె పిటిషన్ యవ్వారం మళ్ళీ మొదటికే వచ్చింది.
తన మీద ఏడాది పాటు సస్పెన్షను అనేది రాజ్యాంగ విరుద్ధం అంటూ రోజా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పేటిషనును 9 వ తేదీన విచారణకు సవీకరిస్తాం అంటూ కోర్టు తెలిపింది. శాసనసభ ముందే మొదలయిపోతున్నందున వెంటనే (అంటే 5, 6 తేదీల లొనే) విచారించాలని రోజా పట్టుపట్టారు. ఆ మేరకు మరో పిటిషన్ వేసారు. పాత బెంచ్ లొనే తేల్చుకోవాల్సిందిగా వారు తెగేసి చెప్పారు. 9 వ తేది కంటే ముందు విచారించడం కుదరదని ఆ బెంచ్ చెప్పింది. దీనితో ఆ పిటిషన్ ను ఉపసంహరించుకుని రోజా మరొక పిటిషన్ వేసారు. అయితే దానిని సవీకరించడంలో సాంకేతిక జాప్యం జరిగి.. ఆ రోజు గడచిపోయింది. ఈ జాప్యాలపై రోజా ఆగ్రహించి సుప్రీం గడప తొక్కారు. అయితే అక్కడ కూడా సాధించింది ఏమి లేదు. ఎందుకంటే.. దీనిని హై కోర్టు లొనే తేల్చుకోవలని సుప్రీం చెప్పింది. 16న విచారణ చేయాల్సిందిగా ఆదేశించింది.
నిజానికి రోజా హైకోర్టు తొలుత అడిగిన వ్యవధి ఇచ్చి ఉంటే… 9 వతేదీన విచారణ జరిగి ఉండేది. ఆమె కొత్తగా సాధించింది ఏమి లేదని.. ఆమె వ్యవహారం మళ్లి మొదటికి వచ్చిందని.. పార్టీలో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.