యువ హీరోల్లో ఏ పాత్రకైనా సరిపడలాని.. పాత్ర ప్రాధాన్యతను బట్టి ఎటువంటి రిస్క్ అయినా చేయాలని కసి రోజురోజుకి పెరుగుతుంది. ఇది నటుడిగా గొప్ప స్థానానికి నాంధి పలుకుంతుందని వారి నమ్మకం అందుకే ఇదవరకు హీరో అంటే హీరోనే.. విలన్ అంటే విలనే అన్న సమీకరణాలు మారి హీరో విలన్ గా.. విలన్ హీరోలుగా మారుతున్నారు. ఇప్పటికే బాహుబలి లాంటి ప్రెస్టిజియస్ మూవీలో హీరోకు తగ్గ విలన్ అది తమ్ముడైనా సరే ఆ దేహ దారుడ్యాన్ని ప్రదర్శించడానికి సరైన విలన్ కోసం వెతుకగా దగ్గుబాటి యువ హీరో రానా ఓకే అనేశాడు. సినిమా రిలీజ్ టైంలో భళ్లాలదేవాగా రానా కాకుండా వేరే ఎవరిని ఊహించాలన్నా కష్టమే అనిపిస్తుంది.
ఇక అది మొదలు తనలో ఉన్న విలక్షణ కోణాన్ని బయటకు తీస్తున్నాడు రానా. ఇప్పటికే పలు హీరోలతో మల్టీస్టారర్ కు సై అంటున్న రానా ఇప్పుడు మరో ప్రెస్టిజియస్ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడని టాక్. లవ్ స్టోరీస్ ఎంతమంది తీసినా తనలా ఎవరు తీయలేరు అన్నట్టు సినిమా ఫీల్ నే తన టేకింగ్ తో మార్చేసే గౌతం మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘ఎనై నొక్కి పాయుమ్ తోట’ సినిమా రెండు రోజుల క్రితమే స్టార్ట్ అయ్యింది. కోలీవుడ్లో ధనుష్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. క్రేజీ కాంబినేషన్ గా రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ కి ప్రతినాయకుడిగా రానా నటిస్తున్నాడట.
హీరో, విలన్ ఇలా సినిమాలో ఓ పాత్రకు తాను సూట్ అవుతాను అనిపించిన ఏ సినిమా అయినా చేసే ఆలోచనలో ఉన్న రానా కచ్చితంగా ట్రెండ్ క్రియేట్ చేస్తాడనడంలో సందేహం లేదు. మరి ధనుష్, రానాల కొట్లాట ఏవిధంగా ఉంటుందో చూడాలి.