రంగుల ప్రపంచం.. ఎన్నో ఆశలతో.. మరెన్నో ఆశయాలతో పరిశ్రమ మీద ఇష్టంతో తెర మీద వెలుగులు చిందించాలని ఆలోచనలతో వస్తారు యువతి యువకులు. కాలం తమను యాంకర్ గా నిర్ధేశించింది అనుకుంటూ వచ్చిన అవకాశంతో సంతృప్తి చెందుతూ వస్తుంటారు. కాని విధి విచిత్రమైందని.. వారి ఆశలను మధ్యలోనే అడి ఆశలు చేసేస్తుంది. వారి జీవితం మధ్యలోనే సుఖాంతం కాదు కాదు దుఖాంతం అయ్యేలా చేస్తుంది.
తెలుగు సిని, టివి పరిశ్రమలో మరో అమ్మాయి జీవితం బలి అయ్యింది. ప్రముఖ తెలుగు టివి మ్యూజిక్ చానెల్ లో యాంకర్ గా కొనాసాగుతున్న నిరోష(23) ఈరోజు ఉదయం ఆత్మహత్య చేసుకుంది. సికింద్రాబాద్ లోని సింధుకాలనిలో మహిళా వసతి గృహంలో నివసిస్తున్న నిరోష జీవితం చాలనుకుందో ఏమో తనువు చాలించింది. చిత్తూరు జిల్లా మల్లేశ్వరపురం గ్రామానికి చెందిన నిరోషకు ఈమధ్యనే నిశ్చితార్ధం కూడా జరిగినట్టు సమాచారం.
నిరోష సూసైడ్ చేసుకునే ముందు ఓ వీడియో కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధి ఆసుపత్రికి తరలించారు.