పవర్ స్టార్ పవన్ కళ్యాన్.. తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలోనే యూత్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఏర్పాటుచేసుకున్నాడు.. అయితే ఇప్పుడు పవన్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు కొత్త వ్యూహం పన్నినట్టున్నాడు. పవన్ సినిమాలు ఎప్పుడు తెలుగులోనే సందడి చేసేవి.. కేవలం తెలుగు సినిమాల స్టామినాతోనే పవర్ స్టార్ గా సౌత్ లో క్రేజీ అభిమానులను సంపాధించుకున్నాడు పవన్.
సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో తాను బాలీవుడ్ మీద కూడా కన్నేశాడని తెలుస్తుంది. సినిమాను హిందిలో కూడా రిలీజ్ చేయనున్నారని ఫ్రెష్ అప్డేట్. అయితే సర్దార్ నిర్మాత శరత్ మారర్ కు బాలీవుడ్ మీడియా మీద మంచి పట్టు ఉంది. అందుకే బీ టౌన్ లో పవన్ సినిమాను అక్కడ స్టార్ హీరోలకు ధీటుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే సర్దార్ బాలీవుడ్ ప్రమోషన్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఉపయోగించేందుకు రంగం సిద్ధ చేశారట కూడా..
సరే సర్దార్ సినిమా అక్కడ రిలీజ్ చేస్తున్నాడు కాబట్టి ఈ హడావిడి అంతా అనుకున్నా పవర్ స్టార్ చేయబోయే తర్వాత సినిమా ఖుషి-2 మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఎప్పుడు లేని విధంగా ముంబైలో పెట్టారు. సో ఇదంతా చూస్తుంటే కెరియర్ లో చేసే మూడు, నాలుగు సినిమాలతో బాలీవుడ్ లో కూడా తన పాగా వేయాలనుకుంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు సౌత్ లోనే తన సత్తా చూపించిన పవన్ ఇకనుండి బాలీవుడ్ లో కూడా తానెంతో ప్రూవ్ చేయాలనుకుంటున్నాడు. మరి బాలీవుడ్ పై దాడికి సిద్ధమైన పవర్ స్టార్ కు నార్త్ ఇండియన్ అభిమానులు ఎలాంటి ఫలితాన్ని అందిస్తారో చూడాలి.