ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ను బట్టే దర్శక నిర్మాతలు కూడా సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక తమిళ్ లో అయితే ఈ థోరణి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం హారర్ కథల నేపథ్యంతో సినిమాలు వస్తుండటం అవి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోవడం జరిగింది. అందుకే తమిళ దర్శక నిర్మాతలు పదే పదే అలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అయితే దర్శకుడి ప్రతిభను బట్టి ఆ సినిమాలకు ఆదరణ లభిస్తుంది అనుకోండి.
తాజాగా ప్రభుదేవ హీరోగా చాలా రోజుల తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా రాబోతుంది. విశేషం ఏంటంటే సినిమాకు సంబంధించి ఓ ఫోటో నెట్ లో హల్ చల్ చేస్తుంది. ఏ.ఎల్ విజయ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను ప్రభుదేవ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టే సమయంలో ఇదే హారర్ కథ అంటూ ప్రమోట్ చేశారు.. తీరా లీక్ అయిన ఫోటో చూసి అందరు షాక్ అవుతున్నారు.
పెళ్లి దుస్తుల్లో ప్రభుదేవ, తమన్నా ఆశ్చర్యం కలిగిస్తున్న ఈ పిక్ కచ్చితంగా సినిమాలోదే.. మరి చెప్పడానికేమో హారర్ అన్నారు చూస్తుంటే ఇది క్లాసిక్ సినిమాలా కబడుతుందే అని ప్రేక్షకులు డౌట్ పడుతున్నారు. మరి విజయ్ కుమార్ ఏం చేస్తాడో ఏమో.. ఇక కొద్దికాలంగా సౌత్ సినిమాలకు దూరంగా ఉన్న ప్రభుదేవ ఈ సినిమా కథ నచ్చి చేసేందుకు ముందుకు వచ్చాడు. అంతేకాదు సినిమాలో ప్రభుదేవతో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు మిల్కీ బ్యూటీ తమన్నా తన సంతోషాన్ని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే కదా..!