మంచు ఫ్యామిలీ నుండి మోహన్ బాబు తర్వాత తన ముగ్గురు వారసులు హవా కొనసాగిస్తూనే ఉన్నారు. తనయులిద్దరు హీరోలుగా మంచి ఫాంలో ఉంటే తనయురాలైనా మంచు లక్ష్మి అటు నటిమణిగా ఇటు నిర్మాతగా మోహన్ బాబు వారసత్వాన్ని కంటిన్యూ చేస్తుంది. అభిరుచి గల వ్యక్తిగా కేవలం హీరోయిన్ గానే కాదు సినిమాలో ఏ చిన్న పాత్రకోసమైనా మంచు లక్ష్మికి అడిగేయొచ్చు అన్న భావన ఉంది పరిశ్రమలో.
అయితే ఇదే మంచు లక్ష్మి మీద మోహన్ బాబు కోపానికి దారి తీసింది. రీసెంట్ గా వచ్చిన బూతు రోత సినిమా గుంటూర్ టాకీస్ లో మంచు లక్ష్మి కూడా పాలుపంచుకుంది. నానా తిప్పలు పడి డబ్బులు కొట్టేసుకుపోతున్న హీరో దగ్గరనుండి ఆకతాయి తనంతో లక్ష్మి ఆ డబ్బులు కొట్టేసే క్యారక్టర్ లో కనిపించింది అలరిస్తుంది. అయితే లక్ష్మి చేయాల్సిన పాత్ర కాకపోయినా ప్రవీణ్ సత్తారు చందమామ కథల్లో ఆమె నటించింది కాబట్టి దర్శకుడి మాటను కాదనలేక చేసింది.
ఇక ఆ పాత్ర గురించి తెలుసుకున్న మోహన్ బాబు మంచు లక్ష్మి మీద తిట్ల దండకం మొదలెట్టాడట.. అలాంటి చెండాలమైన సినిమాలో నువ్వు ఎలా నటించావ్ అంటూ రుసరుసలాడాడట. ఇకనుండి అలాంటి సినిమాల్లో నటించకని గట్టు వార్నింగ్ ఇచ్చాడట. మరి అల్లారు ముద్దుగా చూసుకునే మంచు లక్ష్మి తండ్రి చేత చీవాట్లు తినేలా చేసిన గుంటూర్ టాకీస్ సినిమా ఆమెకు జీవితంలో మరో అనుభవాన్ని మిగిల్చింది.