వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు సునీల్. ఆశలు పెంచుకొన్న కృష్ణాష్టమి కూడా తుస్సుమంది. దిల్‌రాజు గోల్డెన్ హ్యాండ్ కూడా సునీల్‌ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించలేకపోయింది. ఈసారి ఎలాగైనా సరే.. మాస్‌ని మెప్పించి హిట్ కొట్టేయాలని చూస్తున్నాడు. సునీల్ – వంశీ ఆకెళ్ల సినిమా ఇప్పుడు తుది దశకు చేరుకొంది. ఈ సినిమాతో హిట్ కొడితే గానీ… సునీల్ బండి ట్రాక్‌లో పడపడం కష్టం. అందుకే.. ఈ సినిమాపైనే పూర్తిగా తన దృష్టి కేంద్రీకరించాడు.
వంశీ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకొంది. టైటిల్‌ని శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి జక్కన్న అనే పేరు ఖరారు చేసినట్టు టాక్. టాలీవుడ్‌లో ఎస్.ఎస్.రాజమౌళిని ప్రేమగా జక్కన్నా అని పిలుచుకొంటారు. ఆ టైటిల్ క్యాచీగా ఉంటుందని, పైగా.. మాస్‌కి త్వరగా చేరువ అవుతుందని సునీల్ భావిస్తున్నాడట. అందుకే ఈ టైటిల్‌నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.