మంచి టైటిల్ దొరికితే సినిమాకి సగం ప్రమోషన్ ఫ్రీగా దొరికేసినట్టే. అందుకే టైటిల్ కోసం చిత్రరూపకర్తలు కుస్తీపట్లు పడుతుంటారు. తాజాగా… మంచు విష్ఱు కూడా తన సినిమాకి వెరైటీ టైటిల్ పెట్టాలని తెగ తాపత్రయపడ్డారు. ఓ డజను పేర్లు పరిశీలించిన పిమ్మట ఆఖరికి ఓ టైటిల్ ఫిక్స్ చేశారు. అదే… ‘ఈడో రకం..ఆడోరకం’. ఈ సినిమాలో విష్ణతో పాటు , రాజ్ తరుణ్ కూడా కథానాయకుడి పాత్రని పంచుకొన్నాడు. సోనారిక, హెబ్బా పలేట్ కథానాయికలు. జి.నాగేశ్వరరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు వీడో టైపు.. వాడు ఇంకో టైపు అనే పేరు కూడా పరిశీలనకు వచ్చింది. చివరికి ఈడో రకం.. ఆడోరకంకే ఫిక్సయిపోయారు. ఏప్రిల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. విష్ణు నటించిన ఎర్రబస్సు, డైనమైట్ బాక్సాఫీసు దగ్గర పల్టీలు కొట్టింది. అందుకే.. ఓ హిట్టు కొట్టడం అత్యవసరం. రాజ్ తరుణ్ కూడా తోడుగా ఉన్నాడు కాబట్టి ఈసారి బండి నల్లేరుపై నడకేనని విష్ణు నమ్ముతున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి.