నాగార్జున ఈ వయసులోనూ తెగ రెచ్చిపోతున్నాడు. తన కెరీర్లో ఇది వరకు లేనంత జోష్.. ఇప్పుడు నాగ్‌లో కనిపిస్తోంది. మనం, సోగ్గాడే చిన్నినాయన సినిమాలో ఆ హుషారు మరింత పెరిగింది. సోగ్గాడే దాదాపు రూ.50 కోట్లు వసూలు చేసి పరిశ్రమ వర్గాల్ని ఆశ్చర్యపరిచింది. ఊపిరిపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. తన కెరీర్ పరంగా నాగ్ కి పూర్తి సంతృప్తి ఉంది. కానీ ఒకటే బాధ.. వారసులకు సరైన విజయాలు లేవని. నాగచైతన్య ఇప్పటి వరకూ ఒక్క నికార్సయిన హిట్ కూడా కొట్టలేదు. ఎన్నో ఆశలు పెంచుకొని వచ్చిన అఖిల్… తొలి సినిమాకే బొక్క బోర్లాపడ్డారు. ఇప్పుడు వీరిద్దరి కెరీర్‌ని ట్రాక్‌లో పెట్టాల్సిన బాధ్యత నాగ్‌దే.
మీరేమో వరుస హిట్లు కొడుతున్నారు, మరి వారసుల ఫామ్ కలరవ పెట్టడం లేదా? అని అడిగితే నాగ్ ఏం చెప్పాడో తెలుసా? ”వాళ్ల కెరీర్‌పై నాకు అస్సలు బెంగ లేదు. వాళ్ల కెరీర్ ఇప్పుడే ప్రారంభమైంది. స్టార్ డమ్ అందుకోవడానికి ఇంకా టైమ్ ఉంది. వాళ్లింకా నేర్చుకొనే దశలోనే ఉన్నారు. ఇప్పుడే అద్భుతాలు సృష్టించాలంటే ఎలా? నాక్కూడా హలో బ్రదర్ వరకూ స్టార్ డమ్ అంటే ఏంటో తెలీదు. మెల్లి మెల్లిగా వాళ్లూ ఆ స్థాయిని చేరుకొంటారు” అంటూ వారసులపై నమ్మకం వెలుబుచ్చాడు నాగ్.