హైదరాబాద్: బాహుబలి విడుదలరోజున ప్రభాస్ అభిమానులు కొందరు రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఒక ధియేటర్‌వద్ద పోస్టర్‌కు మేకపోతును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. జంతువుల హక్కులపై పోరాడే స్వచ్ఛందసంస్థ ‘పెటా’ ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. మేకను బలి ఇచ్చినవారి ఆచూకీని చెబితే రు.25,000 బహుమానం ఇస్తామని ప్రకటించింది. జంతుబలి ఐపీసీ 429 సెక్షన్ కింద నేరమని తెలిపింది.
విడుదల రోజు కావటంతో తాము టిక్కెట్ల హడావుడిలో ఉన్నామని, బలిగురించి ఎవరో చెబితే వెళ్ళేసరికి వారు మేకను ఆటోలో వేసుకుని పారిపోయారని ధియేటర్ నిర్వాహకులు ఆ రోజు చెప్పారు.