సిద్ధార్థ్, రేష్మి జంటగా నటించి బోల్డ్ సినిమాగా రిలీజ్ అయిన గుంటూర్ టాకీస్ అన్నిఏరియాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. సినిమా ఎంత హిట్ అయ్యిందో అన్ని అపవదాలు మూటకట్టుకుంటుంది. దర్శకుడు ప్రవీణ్ సత్తారు కామెడీ అని ఓ బూతు పురాణాన్ని తెరకెక్కించాడని విమర్శలు వచ్చినా సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం. కమర్షియల్ గా చెప్పుకుంటే ఈ సినిమా సూపర్ హిట్ అన్నమాట.
అయితే సినిమాలో వికలాంగులను అవమాన పరచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని తెలంగాణా వికలాంగుల అసోశియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వ్యవహారం కోర్ట్ దాకా వెళ్ళిందని టాక్. అయితే ఈ విషయం పట్ల దర్శక నిర్మాతలే కాస్త తగ్గి సినిమాలో ఏవైతే వికలాంగులకు సంబంధించి అవమానించారని ఫీల్ అవుతున్నారో ఆ సన్నివేశాలను తొలగించారట. దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ విషయాన్ని గురించి స్పందిస్తూ సినిమాలో ఆ పాత్ర స్వభావాన్ని బట్టి ఆ సన్నివేశం షూట్ చేశాం తప్పించి అది ఎవరిని విమర్శించేందుకు కాదు అని వివరణ ఇచ్చారు.
రేష్మి అందాలు శ్రద్దా దాస్ సోయగాలు కలిసి సినిమాను బోల్డ్ హిట్ చేసినా ఫ్యామిలీ ఆడియెన్స్ మాత్రం సినిమా గురించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చందమామ కథలు సినిమా తీసిన ప్రవీణ్ ఈసారి ఇంత రోత సినిమా ఎలా తీయగలిగాడు అంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా సినిమా హిట్ కొట్టి ప్రవీణ్ తన సత్తా ఏంటో చాటాడని చెప్పొచ్చు.