టాలీవుడ్ లో చిన్న సినిమాల కష్టాలు ఇంకా తప్పేట్టు లేవు.. సినిమా మొదలైన నాటి నుండి రిలీజ్ అయ్యే దాకా చిన్న సినిమా కష్టాలు పడుతూనే ఉన్నాయి.. ఎంతో శ్రమకూర్చి సినిమా చేస్తే దాన్ని రిలీజ్ చేయడానికి నానా తిప్పలు పడాల్సి వస్తుంది. ఇక సినిమా మొత్తం అనుకున్నది అనుకున్నట్టుగా సరైన అవగానతో చేసే చిన్న సినిమాల దర్శక నిర్మాతలు తమ సినిమా రిలీజ్ విషయంలో తగిన జ్రాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు.
వారాంతరం వచ్చేసరికి ఒకేరోజు నాలుగు ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్న ఈ సందర్భంలో చిన్న సినిమా చితికిపోవడం ఖాయం అనే విషయం వ్యక్తిగతమవుతుంది. ఏ సినిమా కోసమైనా 24 శాఖల వారు కష్టపడటం జరుగుతుంది. మరి ఆ కష్టం కనీసం సినిమా ఒక్కరోజు కూడా థియేటర్ లో సందడి చేయలేకపోవడం చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పాలి.
సంక్రాంతి తర్వాత దాదాపు ప్రతి వారం సినిమాల రిలీజ్ సందడి జరుగుతూనే ఉంది. కాని వాటిలో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలు ఎన్ని అంటే వేళ్లతో కాదు నోటితో లెక్క పెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి సినిమా తీసే దర్శక నిర్మాతల తప్పా లేక రిలీజ్ చేసే టైం తప్పా అనేది మరోసారి విశ్లేషించుకుంటే ఇలా జరిగే అవకాశం ఉండేది కాదు. మరి రిలీజ్ కోసం మనకు మనమే కొట్టుకోకుండా సినిమా బ్రతకాలంటే ఒకరికొకరు సహకరించుకుంటే మంచి పద్దతి అంటూ ఈ విషయం మీద కింగ్ నాగార్జున ఊపిరి ప్రమోషన్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ప్రస్తావించడం జరిగింది.