ఏంటి ఎప్పుడులేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా ఆడియోకి ఇంత హంగామా చేస్తున్నారు అంటే దానికి కారణం వేరే ఉంది అనేస్తున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మెగా ఈవెంట్ దేనికి పోకుండా మెగా ఫ్యామిలీకు దూరంగా ఉంటూ వస్తున్న పవర్ స్టార్ మెగా కాంపౌండ్ కి దూరమయ్యాడనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే వాటిని చేధిస్తూనే పవర్ స్టార్ బ్రూస్ లీ రిలీజ్ టైంలో మెగాస్టార్ ను కలిసి తన కృతజ్ఞతలు తెలియచేయడం.. ఇక మెగాస్టార్ కూడా పవన్ షూటిగ్న్ స్పాట్ కు అనూహ్యంగా రావడం అంతా తెలిసిందే.
అయితే రేపు భారీగా జరుగనున్న సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియోకి మెగా రంగు అద్దుకుంది అంటున్నారు. మెగాస్టార్ ముఖ్య అతిధిగా రాబోతున్న ఈ ఆడియో వేడుకలో తామంతా ఒక్కటే అని దండోరా వేయనున్నారట మెగా ఫ్యామిలీ. ఇక మెగాస్టార్ బర్త్ డే నాడు ఎమోషనల్ గా మాట్లాడిన నాగబాబు కూడా ఈ ఆడియోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక చిన్న చితకా మెగా హీరోలు మొత్తం వచ్చి మెగా పవర్ అంటే ఏంటో అభిమానులకు చూపించనున్నారన్న మాట.
సో మెగా ఉత్సాహంలో సర్దార్ ఆడియో ఎలా జరుగనుందో రేపు తెలిసిపోద్ది.. బాబి దర్శకత్వం వహించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో, టైటిల్ సాంగ్ టీజర్ అభిమానుల్లో సినిమా మీద ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. టీజర్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి మరోసారి పవర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది.