స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా… సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో… సూపర్ డూపర్ హిట్స్ ని అందించిన ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్లో… విజయవంతమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం సరైనోడు. తమన్ సంగీతమందిస్తున్న ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను చేయనున్నారు. ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ అందచందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అంజలి ఓ ప్రత్యేకగీతంలో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులేసింది.
ఈ సందర్బంగా నిర్మాతలు మాట్లాడుతూ…. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న సరైనోడు చిత్రంపై ఉన్న భారీ అంచనాల్ని తప్పకుండా రీచ్ అవుతాం. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అద్భుతమైన పాటలు కంపోజ్ చేశాడు. ఈ చిత్ర పాటల్ని ఏప్రిల్ 1న నేరుగా మార్కెట్లోకి విడుదల చేసేందుకు నిర్ణయించాం. ఏప్రిల్ రెండో వారంలో విశాఖపట్నంలో సరైనోడు మూవీ ప్రీ రిలీజ్ హాంగామా అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా చేయబోతున్నాం. ఏప్రిల్ 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా సరైనోడు చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అల్లు అర్జున్ ని సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నాడు బోయపాటి శ్రీను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే హై ఓల్డేజ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రకుల్, కేథరీన్ గ్లామర్, తమన్ సంగీతం, రిషి పంజాబి ఛాయాగ్రహణం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అల్లు అర్జున్, అంజలి కాంబినేషన్లో వచ్చే ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది. అని అన్నారు.
నటీనటులు
అల్లు అర్జున్, రకుల్ ప్రీత్ సింగ్, కేథరీన్ థెస్రా, శ్రీకాంత్, ఆది పినిశెట్టి, సాయి కుమార్, బ్రహ్మానందం, జయప్రకాష్, జయప్రకాష్ రెడ్డి, సురేఖా వాణి, విద్యుల్లేఖ, దేవ దర్శిని, అంజలి (ప్రత్యేక పాటలో)
సాంకేతిక వర్గం
బ్యానర్ – గీతా ఆర్ట్స్
ప్రొడక్షన్ కంట్రోలర్స్ – బాబు, యోగానంద్
చీఫ్ కోఆర్డినేటర్ – కుర్రా రంగారావ్
ఆర్ట్ డైరెక్టర్ – సాయి సురేష్
ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్స్ – రామ్ లక్ష్మణ్, రవి వర్మ
డిఓపి – రిషి పంజాబి
డైలాగ్స్ – ఎం.రత్నం
మ్యూజిక్ – ఎస్ ఎస్ తమన్
కో ప్రొడ్యూసర్ – శానం నాగ అశోక్ కుమార్
ప్రొడ్యూసర్ – అల్లు అరవింద్
డైరెక్టర్ – బోయపాటి శ్రీను