చట్టసభలు న్యాయవ్యవస్థ,కార్యనిర్వాహక వ్యవస్థ వీటి మధ్య సంబంధాల విషయంలో భారత రాజ్యాంగం స్పష్టంగా వుంది. ఈ మూడూ రాజ్యాంగ పరిధిలోనే పనిచేయాలి. అదే పూర్తి పార్లమెంటరీ విధానం గల ే బ్రిటన్‌లో చట్టసభలే తప్ప రాజ్యాంగం చివరి మాట కాదు. అద్యక్ష పాలన గల అమెరికాలోనైతే సుప్రీం కోర్టు (ఫెడరల్ కోర్టు)ది అత్యున్నత అధికారం. భారత దేశం ఫెడరల్ యూనిటరీ లక్షణాలు రెండూ కలిగివున్నందున స్పీకర్ నిర్ణయం అంతిమమైనప్పటికీ – ఇక్కడ కోర్టులు చట్టసభలు చేసిన చట్టం లేదా చర్య రాజ్యాంగ మౌలిక సూత్రాల పరిధిలో వుందా లేదా అని సమీక్షించే అధికారం కలిగివుంటున్నాయి.
మధ్యప్రదేశ్, తమిళనాడు,మహారాష్ట్ర, హర్యానా వంటి చోట శాసన్ల సభ్యులను తొలగించినప్పుడు కోర్టులు ఇచ్చిన ఆదేశాలు తీర్పులు సమస్యలకు దారితీశాయి. 2005 డిసెంబరులో ప్రశ్నల కుంభకోణం సందర్భంలో అవినీతికి పాల్పడిన 11 మంది ఎంపిల సభ్యత్వ రద్దు సమయంలోనూ ఇలాటి వివాదమే ఏర్పడింది. వారి విషయం సభా హక్కుల సంఘానికి నివేదించకుండా నిర్ణయం తీసుకోవడం అందుకు 102వ నిబంధన వినియోగించడం చెల్లదని సుప్రీం కోర్టు భావించింది. దీనిపై కోర్టుకు హాజరై వాదన ఇవ్వాల్సిందిగా అప్పటి స్పీకర్ సోమనాథ్ చటర్జీకి నోటీసు పంపించింది. దానిపై ఆయన అఖిలపక్ష సమావేశం జరపగా ఈ నోటీసును పాటించాల్సిన పనిలేదని దాదాపు అందరూ అభిప్రాయపడ్డారు. చర్యకు గురైన వారిలో అయిదుగురు బిజెపికి చెందిన వారు గనక ఆ పార్టీ మాత్రం స్పీకర్ తను వెళ్లేబదులు తన ప్రతినిధిని పంపి వాదన వినిపించవచ్చని చెప్పింది. ఒక వేళ నేనే వెళ్లినప్పటికీ చట్టసభల స్వతంత్ర ప్రతిపత్తి మాత్రం రాజీపడకూడనిదని సోమనాథ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు పివినరసింహారావు ప్రభుత్వ హయాంలో ముడుపులుతీసుకున్న జెఎంఎం సభ్యుల విషయంలోనూ ఏ చర్య తీసుకోవాలో సభే నిర్ణయించాలని కోర్టు స్పష్టం చేసింది.
రాజ్యాంగం 105 అధికరణం, 122(1)(2)అధికరణాలు పార్లమెంటు స్పీకర్‌కు సభ్యులకు విధి నిర్వహణకు సంబంధించి తిరుగులేని అధికారాలిస్తున్నాయి. 194(3) అదే విధమైన అధికారాలను శాసనసభలకు ఇస్తున్నది. స్పీకర్ పరిపాలనాధికారాలకుు సంబంధించిన ివాటిలోనైతే నేరుగా జోక్యం చేసుకోవచ్చని బొర్రబాబు కేసులో సుప్రీం ి్ట వైఖరి తీసుకుంది. ్న ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం అర్హత అనర్హతలు నిర్ణయించడంలోనూ స్పీకర్‌దే తుది నిర్ణయం అయినప్పటికీ దాన్ని సవ్యంగా అన్వయించారా లేదా చెప్పే అధికారం తమదేనని కోర్టులు అంటుంటాయి. ఈ వాదోపవాదాలెలా వున్నా ఆచరణలో మాత్రం ఇది ఎడతెగని వివాదంగానే నడుస్తున్నదనేది నిజం.