పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ ఆడియో రేపు రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈరోజు ఉదయం నుండే అభిమానుల హడావిడి మొదలైంది. నోవాటేల్ లో జరుపుకోబోతున్న ఈ ఆడియో పాస్ ల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ట్రై చేస్తున్నారు. అయితే ఉదయం నుండి సర్దార్ ఆడియో క్యాన్సిల్ అయినట్టు ప్రచారం జరిగింది. సో ఇన్ని కారణాల దృష్ట్యా కొద్దిసేపటి క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో అనుకున్నట్టుగానే రేపు రిలీజ్ అవుతుంది. ముందు ఆడియో వేడుకలాంటిది ఏమి లేకుండా చేద్దామనుకుంటే చిత్రయూనిట్ చేసిన ఏర్పాట్లు నచ్చి ఆడియో వేడుకకు ఒప్పుకున్నానని అన్నాడు పవన్. ఇక పాస్ లు ఉన్నవారు మాత్రమే ఆడియో ఫంక్షన్ కు రావాలని అన్నారు పవన్. ఆడియో చీఫ్ గెస్ట్ గా అన్నయ్య చిరంజీవి రావడం కన్ఫాం చేసిన పవన్ తన గబ్బర్ సింగ్ ఆడియో కూడా ఆయనే చేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ఇక సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా హిందీలో రిలీజ్ చేయడానికి గల కారణాలు ఈ సినిమా ఖమ్మం – చత్తీస్ ఘడ్ బోర్డర్ లో సాగుతుంది. అందుకే హింది కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి హిందిలో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించాం. హిందిలో నా డబ్బింగ్ వేరే వారు చెప్పే అవకాశం ఉంది అన్నారు. ఇక రాం గోపాల్ వర్మ చేస్తున్న కామెంట్స్ కు మీరు ఎలా స్పందిస్తారు అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ ఆయన ఒరినియన్స్ కు నేను ఎప్పుడు గౌరవమిస్తాను అన్నారు. సినిమా అనుకున్న టైంలోనే ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుందని.. ఈ ఆడియో లాంచ్ కు అనుమతిచ్చిన పోలీస్ శాఖకు, తెలంగాణా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఆడియో ఫంక్షన్ కు పాస్ లు ఉంటేనే రండి లేదంటే టివిల ముందు కూర్చొని చూడండి అని అన్నారు.