ప్రస్తుతం రెండు రోజుల నుండి టాలీవుడ్ లో ఒకటే హడావిడి అదే సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో గురించి.. పవర్ స్టార్ ఆడియోకి కూడా ఇంత హడావిడి చేస్తున్నారు అభిమానులు. సెక్యురిటీ కారణాల దృష్ట్యా కేవలం లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే అనుమతి ఇచ్చేలా ఆడియో రిలీజ్ తీసుకెళ్లి నోవాటెల్ లో పెట్టారు చిత్రయూనిట్. అయితే ఈ చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనబడుతున్నారు.
అందుకే అభిమానుల ఇంత భారీ హంగామా చేస్తున్నారు. అయితే చిరు గెస్ట్ గా పిలవడం ఓకే మరి ఆడియోలో చిరు మాట్లాడే ప్రసంగం ఎలా ఉండబోతుంది అన్న దాని మీద ఇప్పుడు సోషల్ సైట్స్ లో హాట్ డిస్కషన్ జరుగుతుంది. తమ్మడికున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఏ విధంగా తనకు సపోర్ట్ ఇవ్వనున్నాడు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అంతేకాదు కొద్దిరోజులుగా మెగా, పవర్ అభిమానుల మధ్య జరుగుతున్న చిన్న చిన్న గొడవలకు ఈ వేడుక ద్వారా ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అంటూ మెగా మేనియాను ఈ ఆడియోతో చెప్పాలనుకుంటున్న ముఖ్య ఉద్దేశం. తమ్ముడు గురించి అన్నయ్య.. అన్నయ్య గురించి తమ్ముడు ఏం మాట్లాడతారు అన్నదాని మీదే ఇప్పుడు అందరి చూపు ఉంది. సాయంత్రం 7 గంటల నుండి ప్రముఖ న్యూస్ ఛానెల్ లో ఈ ఆడియో వేడుక కార్యక్రమం లైవ్ కవరేజ్ చేయనున్నారు.