తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కొత్తదనానికి ఉరకలు వేస్తున్న ఇప్పటి యువతరానికి ఆయన గురించి ఎంత తెలుసు ఏమి తెలుసు అన్నది మనకు తెలియదు కాని తెలుగు సిని ప్రస్థానంలో తెలుగు సినిమా చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ వేసిన గ్రాండ్ మార్క్ ఎప్పటికి అలానే ఉంటుంది. ఎప్పుడు ప్రయోగాలకు పట్టం కట్టే సూపర్ స్టార్ కృష్ణ తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రంగా ‘గూడాచారి 117’ సినిమా చేయడం జరిగింది. ఇక తొలి తెలుగు కౌబాయ్ సినిమాగా ‘మోసగాళ్లకు మోసగాడు’, తొలి సినిమా స్కోప్ గా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలు చేయడం జరిగింది. కొత్త ప్రయత్నాలే అయినా వాటితో చరిత్రలో నిలిచిపోయే రికార్డులను సాధించడం జరిగింది కృష్ణ.
ఇక మార్చ్ 21, 1986లో రిలీజ్ అయిన సినిమా సింహాసనం.. తొలి తెలుగు 70 ఎం.ఎం సినిమాగా రిలీజ్ అయిన ఈ సినిమా కృష్ణ దర్శక నిర్మాతగా వ్యవహరించడం జరిగింది. సరిగ్గా 30 ఏళ్ల ముందు ఈ సినిమా రిలీజ్ అయ్యి రికార్డ్ కలక్షన్స్ సాధించింది. సినిమా రిలీజ్ అయిన మొదటి వారమే 1 కోటి 51 లక్షల 65 వేల 291 రూపాయలు కలెక్ట్ చేసి సూపర్ స్టార్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. జానపద సినిమాల్లో ఓ కొత్త సంచలనాన్ని సృష్టించిన ఈ సినిమా వైజాగ్ చిత్రాలయ థియేటర్ లో.. విజయవాడ రాజ్ థియేటర్ లో.. హైదరబాద్ దేవి థియేటర్ లో విజయవంతంగా వందరోజులు ప్రదర్శించ బడింది.