తెలంగాణ శాసనసభలో మంగళవారం రచ్చ రచ్చ అయిపోయింది. ఈ రచ్చ మొత్తం ‘సంస్కారం’ చుట్టు తిరగడం విశేషం. కాంగ్రెస్ పార్టీ కి చెందిన మాజీ మంత్రి డీకే అరుణ స్పీకర్ చైర్ లో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ని ఉద్దేశించి “సంస్కారం లేనివాళ్ళు సభ నడిపిస్తున్నారు” అని వ్యాఖ్యానించడం తో పెద్ద గొడవ అయిపొయింది. పద్మ దేవేందర్ చైర్ లో ఉండగా డీకే అరుణ ఈ కామెంట్ చేయడం, దానితో మనస్తాపానికి గురైన స్పీకర్ చైర్ లో ఉండగానే కంట తడి పెట్టుకోవడం పెద్ద వివాదంగా మారిపోయింది. దీని మీద డీకే అరుణ చివరి వరకు వెనక్కు తగ్గక పోవడం, సారీ చెప్పడానికి ఒప్పుకోకపోవడం విశేషం. చివరికి ఆమె మీద సస్పెన్షన్ వేటు వేయడానికి మంత్రి హరీష్ రావు తీర్మానం చదవడానికి కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత పద్మా దేవేందర్ రెడ్డి.. ఈ వివాదాన్ని డీకే అరుణ విజ్ఞత కే వదిలేస్తున్నా అంటూ వేటు వేయనివ్వకుండా… చర్చను ముగించారు.
స్పీకర్ ను ఉద్దేశించి డీకే అరుణ నోరు జారి అనేసిన మాట వాస్తవం అయినప్పటికీ దాన్ని ఒప్పుకోవడానికి ఆమెకు అహం అడ్డు వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అప్పటికీ పాలక పక్షానికి చెందిన సభ్యులు చాల సేపటివరకు ఆమె చైర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన డీకే అరుణ పట్టించుకోలేదు. ఒకదశలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడు జానారెడ్డి చెప్పబోయినా ఆమె చెవిన వేసుకోలేదు. పాలక పక్ష సభ్యులంతా.. జానారెడ్డి వంటి పెద్దలు ఉన్న సభలో ఇలా మాట్లాడతారా.. అని అడుగుతోంటే.. అయన తన పార్టీ సభ్యులతో క్షమాపణ చెప్పించలేక, అలాగని తప్పు ఆపుకోలేక సతమతం అయిపోయారు. కొన్ని సందర్భాల్లో నోరు జరుతుంటారు అని అయన అనడం కూడా వివాదమే అయింది.
జానారెడ్డి , అరుణ నుంచి వివరణ తానూ తెలుసుకుని, స్పీకర్ ను ఉద్దేశించి అనలేదు అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేసారు. అయితే క్షమాపణ చెప్పడం కోసం పదేపదే అడిగిన మంత్రి హరీష్ రావు , డీకే అరుణ సస్పెన్షన్ కు ప్రతిపాదన చదవడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో అరుణ మాట్లాడుతూ తను అసలు ఆ మాటే అనలేదని, తనను ఉద్దేశించి మంత్రి హరీష్ సంస్కారం లేదని అన్నారని ఎదురుదాడికి దిగడంతో, స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి విసిగిపోయారు. సస్పెన్షన్ తీర్మానం చదివే అవకాశం కూడా హారీష్ రావు కు ఇవ్వకుండా, ఈ విషయాన్ని సభ్యురాలి విజ్ఞతకే వదిలేస్తున్నా అంటూ తన హుందా తనాన్ని నిలబెట్టుకున్నారు.
మొత్తానికి సభలో అరుణ దుడుకుతనం ఒకటి బయల్పడగా, కాంగ్రెస్ నేత జానారెడ్డి మాటను ఆ పార్టీ సభ్యులు ఖాతరు చేయరు అనే సంగతి కూడా తేలిపోయింది. అరుణ వైఖరి, అబద్దాలు చెప్పిన తీరును అందరు ఏవగించుకోవడం విశేషం.
319 7ఏ డిఫమేటరీ పదాలు మాట్లాడరాదు.