సౌత్ ఇండియన్ సూపర్ టాలెంటెడ్ డైరక్టర్ శంకర్ ప్రస్తుతం రోబో 2.0 సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు.. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో మరో షెడ్యూల్ షూట్ చేస్తున్న శంకర్ ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. రోబో 2.0 షూటింగ్ సెప్టెంబర్, అక్టోబర్ కల్లా పూర్తవుందని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకుని సినిమా డిశెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
అయితే డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినికాంత్ పుట్టినరోజు సందర్భంగా రోబో 2.0 రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుత షెడ్యూల్ లో రజిని, అక్షయ్ కుమార్ ల మీద పోరాట సన్నివేశాలు షూట్ చేస్తున్నారట. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబడుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 350 కోట్ల దాకా ఉంటుందని అంచనా.. అసలైతే శంకర్ ఓ సినిమా తీయడానికి రెండు సంవత్సరాల టైం తీసుకుంటాడు కాని రోబో 2.0 విషయంలో ఓ సంవత్సరంలో సినిమాను కంప్లీట్ చేయాలని కసితో ఉన్నాడు.
అనుకున్నది అనుకున్నటుగా జరిగితే ఈ డిసెంబర్ కు రోబో రిలీజ్ గ్యారెంటీ అనేస్తున్నారు చిత్రయూనిట్. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించడం జరుగుతుంది.