కమెడియన్‌గా తన ప్రస్థానం ప్రారంభించాడు సునీల్. ఇప్పుడైతే హీరో అయ్యాడు గానీ… సునీల్ అంటేనే కామెడీ. హీరో అవతారం ఎత్తినా సరే, సునీల్ కామెడీ చేయాల్సిందే. లేదంటే.. తెలుగు ప్రేక్షకులకు రుచించదు. ఈ విషయాన్ని పక్కన పెట్టి డాన్సులు, ఫైటింగులు, ఎమోషనల్ డైలాగులూ అంటూ వేరు వేరు దారుల్లో ప్రయాణిస్తున్నాడు సునీల్. ఆయన సినిమాల్లో అన్నీ ఉంటున్నాయి గానీ, కామెడీ మాత్రం మిస్సవుతుందని తెలుస్తూనే ఉంది. అందుకే సునీల్ సినిమాలు పల్టీలు కొడుతున్నాయి. తాజాగా కృష్ణాష్టమి ఫ్లాప్ అవ్వడానికి కూడా కారణం అదే. కానీ.. సునీల్ మాత్రం తన తప్పుల్ని మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తున్నాడు.
దర్శకుడు క్రాంతి మాధవ్ తో ఓ సినిమాని ఓకే చేయించుకొన్నాడు సునీల్. ఆయన ఖాతాలో ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు సినిమాలున్నాయి. రెండూ ఫీల్ గుడ్ మూవీసే. రెండు సినిమాల్లోనూ హీరో పాత్రలు చాలా ఉదాత్తంగా సాగుతాయి ఈ తరహా.. పాత్రలు సునీల్‌కి ఏమాత్రం నప్పవు. పైగా ఇలాంటి పాత్రల్లో నటించినా.. ఆదరణ లభించలేదు. ఈ సినిమాలోనూ అలాంటి కథ, అలాంటి హీరో క్యారెక్టర్ కనిపిస్తే మాత్రం భరించడం కష్టం. సునీల్ తనకు సూట్ కాని జోనర్‌ని టచ్ చేయడం అత్యంత సాహసం అని ఇప్పటికైనా గుర్తించుకోవాలి. సునీల్ సినిమా అంటే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్. అవి ఎక్కడ దొరుకుతాయో.. గమనిస్తే మంచిది.