అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా అఖిల్ ఘోర పరాజయం పొందడంతో అఖిల్ రెండో సినిమా గురించి అక్కినేని ఫ్యామిలీ తీసుకుంటున్న జాగ్రత్తలు అన్ని ఇన్ని కావు.. అఖిల్ సినిమా వచ్చెళ్లి చాలా రోజులైంది ఇంతవరకు అఖిల్ తన రెండో సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఆ సినిమా దర్శకుల గురించే వారని వీరని పేర్లు వినపడుతున్నాయి తప్ప ఎవరు ఫైనల్ కాలేదు.
ఈ మధ్య ఊపిరి సినిమా దర్శకుడు వంశీ చెప్పిన కథ నాగ్ కు నచ్చిందని అఖిల్ తో వంశీ పైడిపల్లి చర్చలు జరుపుతున్నారని అన్నారు. అది అనడం మొదలు వంశీ పైడిపల్లినే అఖిల్ రెండవ సినిమా దర్శకుడు అంటూ హడావిడి చేయడం మొదలు పెట్టారు. అయితే ఊపిరి ప్రమోషన్స్ లో పాల్గొన్న వంశీని అఖిల్ సినిమా గురించి అడిగితే మాత్రం దానిపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.. దానిపై ఇంకా క్లారిటీ రాలేదు అంటూ మాట మార్చాడు.
సో దీన్ని బట్టి అఖిల్ సినిమా నుండి వంశీ పైడిపల్లి కూడా సైడ్ అయ్యాడన్న సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం మాత్రం రేపు రిలీజ్ అవుతున్న ఊపిరి సినిమా మీద ఫోకస్ పెట్టి ఉంచారు చిత్ర యూనిట్. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా విజయం మీద చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.