శుక్రవారం విడుదల కాబోతున్న ఊపిరి చిత్రానికి అన్నీ శుభశకునములే. ఊపిరికి పాజిటీవ్ బజ్ ఉంది. కార్తీ వల్ల.. తమిళంలో ఈ సినిమాకి క్రేజ్ పెరిగింది. పాటలు బాగున్నాయి. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నామన్న ఫీలింగ్ కలుగుతోంది. పైపెచ్చు.. ఊపిరికి పోటీనే లేదు. నిలబడిందంటే.. కోట్లు కొల్లకొట్టడం ఖాయం. ఇన్ని ప్లస్సులు ఉన్నా, ఓకే ఒక్క మైనస్ ఈ చిత్రబృందాన్ని భయపెడుతోంది. అదే తమన్నా.
నటిగా, గ్లామర్ తారగా తమన్నా ని తక్కువ చేయలేం గానీ, ఆమెకు పెద్దగా అదృష్టం కలసిరాదన్నది వాస్తవం. అగ్ర హీరోలతో తమన్నా జట్టు కట్టిన సినిమాలన్నీ ఫట్టే. ఊసరవెల్లి, కెమెరామెన్ గంగతో రాంబాబు, రెబల్, ఆగడు.. ఇలా చాలా ఉదాహరణలే కనిపిస్తాయి. ఇన్ని సినిమాలు చేసినా, ఇంత క్రేజ్ ఉన్నా తమన్నా నెంబర్ 1 రేసులోకి ఇప్పటికీ రాకపోవడానికి ప్రధాన కారణం అదే. ఇప్పుడు ఊపిరికీ తమన్నానే ఐరెన్ లెగ్గా మారుతుందేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకీ అదే సీన్ రిపీట్ అయితే తమన్నాపై ఐరెన్ లెగ్ అనే ముద్ర మరింత బలంగా నాటుకుపోవడం ఖాయం. తమన్నా కూడా అదే విషయంలో భయపడుతోందట. ఈ సినిమా ఎలాగైనా హిట్టయి.. అపప్రద తొలగించాలని కోరుకొంటోందట. అదే జరిగితే, అంతకంటే కావాల్సింది ఏముంది?