సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మొత్తం పవన్ కల్యాణే డైరెక్ట్ చేసేశాడని ఇండ్రస్ట్రీ వర్గాలు కోడై కూస్తున్నాయి. బాబి నామ మాత్రపు దర్శకుడని, ఆయన మోనేటర్ ముందు కూర్చోవడం మినహా ఏమీ చేయలేదని గుసగుసలాడుకొంటున్నాయి. అంటే సర్దార్ సినిమాకి అటు పవన్. ఇటు… బాబి ఇద్దరూ దర్శకులే అన్నమాట. ఇప్పుడు సర్దార్ దర్శకుడిగా మరొకరి పేరు వినిపిస్తోంది. ఆయనే.. హరీష్ పాయ్.
పవన్ కల్యాణ్‌కి అత్యంత సన్నిహితుడు హరీష్ పాయ్. పవన్ కెరీర్ ప్రారంభించిన కొత్తలో డాన్స్ మాస్టర్ ఈయనే. హరీష్ దగ్గరే పవన్ డాన్సింగు క్లాసిలు తీసుకొన్నాడు. పవన్ తొలి సినిమాలకూ ఈయన పనిచేశారు. సర్దార్ గబ్బర్‌సింగ్‌కి ప్రొడక్షన్ డిజైనర్‌గా కొత్త అవతారం ఎత్తారు. అయితే ఈ సినిమాకి మూడో దర్శకుడిగానూ పనిచేశాడని టాక్. సినిమాని తొందరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతో మూడు నాలుగు డైరెక్షన్ డిపార్ట్మెంట్లతో పనిలాగించింది సర్దార్ టీమ్. అందులో ఓ టీమ్‌కి.. హరీష్ దర్శకుడట. కీలకమైన సన్నివేశాల్లో కొన్ని హరీషే తెరకెక్కించాడన్న టాక్ వినిపిస్తోంది. అలా.. సర్దార్ ఖాతాలో మరో దర్శకుడు పెరిగాడన్నమాట.