ఆ 9 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా నుంచి తెదేపాలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి కాదు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హరీష్ రావత్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి. నిన్న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినట్లు ప్రకటన వెలువడగానే, స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్ వాల్ రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి మరియు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ్ బహుగుణతో సహా 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ పని చేసి ఉండి ఉంటే ఎటువంటి సమస్య ఉండేది కాదు కానీ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తరువాత స్పీకర్ ఇటువంటి నిర్ణయం తీసుకొంటే అది అమలవుతుందో లేదో రాజ్యాంగ నిపుణులు తేల్చవలసిన విషయం.