నాగార్జున కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం ఊరిపి అంటూ… పబ్లిసిటీ ముంచెత్తింది పీవీపీ సంస్థ. మరో హీరో కార్తి ఉన్నాడు, తమన్నా ఉంది, ఫారెన్ లో షెడ్యూల్ జరిగింది.. కాబట్టిబాగానే ఖర్చు అయ్యిండొచ్చు. అయితే ఊపిరి బడ్జెట్ ఏకంగా రూ.60 కోట్లు అని చెప్పి షాక్ ఇచ్చింది టీమ్. సినిమా చూస్తే రిచ్గానే కనిపించింది. కానీ రూ.60 కోట్లు అయ్యేంత సీన్ లేదన్నది అర్థమవుతూనేఉంది. నాగ్, కార్తీల ఇద్దరి మార్కెట్ కలిపినా అరవై కోట్లుండదు. అలాంటప్పుడు పీవీపీ అంత భారీగా ఖర్చు పెడుతుందని భ్రమ పడడమూ తప్పే.
ఈ సినిమా బడ్జెట్ రూ.40 కోట్లు దాటదని విశ్వసనీయ వర్గాల సమాచారం. అదీ… స్పెయిన్ ఎపిసోడ్కి కాస్త ఖర్చయి ఉండొచ్చు. మిగిలిన సినిమా అంతా ఇన్డోర్లోనే తీశారు. రూ.40 కోట్లయినా నాగ్ కి భారీ బడ్జెట్ సినిమానే అనుకోవాలి. కార్తీ ఉన్నాడు కాబట్టి ఈ సినిమా తమిళంలోనూ బాగా వర్కవుట్ అవుతుందని పీవీపీ భావించి ఉంటుంది. అనుకొన్నట్టుగానే తమిళంలో ఓ రేంజులో వసూళ్లు అందుకొంటోంది ఊపిరి. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా అక్కడి వెర్షన్లో కొన్ని మార్పులు చేశారు. కార్తీ పాత్ర ఎక్కువ ఉండేలా ఎడిట్ చేశారు. దాంతో.. పీవీపీ ప్లాన్ వర్కవుట్ అయ్యింది.