గాడ్ ఫాదర్ సినిమానే కాస్త అటూ ఇటూగా చేసి పేర్లు మార్చి తీసిన సినిమానే తీస్తుంటాడని రాంగోపాల్ వర్మపై అక్కసు వెళ్లబోసుకొంటుంటారు కొంతమంది సినీ అభిమానులు. అలాంటి వాదనలకు మరోసారి ఊతం లభించింది. వర్మ తాజా చిత్రం ఎటాక్.. ఈ సినిమా నుంచి ఓ సరి`కొత్త` పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. మనోజ్ సగం బొమ్మ చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.కానీ.. ఆ సగం బొమ్మలోనే రెండు రకాల మొహాలు కనిపిస్తున్నాయి. దీన్ని వర్చువల్ పోస్టర్స్ అంటుంటారు.
అయితే ఈ రకం పోస్టర్ ఇది వరకు యాక్షన్ త్రీడీ సినిమా కోసం విడుదల చేశారు. నరేష్ బొమ్మ ఇలానే త్రీడీ టైపులో కనిపించి ఆకట్టుకొంది. సేమ్ టూ సేమ్ అదే.. థీరీని వర్మ ఈసినిమా కోసం పాటించాడు. యాక్షన్ త్రీడీలోని నరేష్ బొమ్మని వర్మ ఈ రకంగా కాపీ కొట్టాడు. గాడ్ ఫాదర్ని నమ్ముకొని సినిమాలు తీస్తుకొస్తున్న వర్మ.. ఇప్పుడు పోస్టర్లనూ కాపీ కొట్టడం మొదలెట్టాడన్నమాట. ఇక ఎటక్లో… ఇంకెన్ని వింతలుంటాయో చూడాలి.