కుర్రాడే అయిన గట్టోడు అనిపించుకున్నాడు జి.వి ప్రకాశ్ అందుకే అతి చిన్న వయసునుండే సంగీత సాధన చేసి మ్యూజిక్ డైరక్టర్ గా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చాడు. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు అయితే అనిరుధ్ లేదా జివి ఇద్దరే ఆప్షన్ అయితే ఈ మ్యూజిక్ డైరక్టర్ సడెన్ గా హీరోగా మారాలనే ఆలోచన రావడం సినిమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ జి.వి.ప్రకాశ్ తీస్తున్న సినిమాలు కమర్షియల్ గా బాగానే వర్క్ అవుట్ అవుతున్నాయి. ఇక త్రిష లేదా నయనతారా సినిమాతో తెలుగులో కూడా పర్వాలేదనిపించుకున్నాడు.
ప్రస్తుతం ‘కడవుల్ ఇరుక్కన్ కుమార’ షూటింగ్ లో ఉన్న జివి ప్రకాశ్ కు అనుకోకుండా ఓ పెను ప్రమాదం నుండి బయటపడ్డాడట. చెన్నై పరిసర ప్రాతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర యూనిట్ జివి ఉన్న కార్ ను ఓ కంటైనర్ ఢీ కొట్టబోయిందట. కార్ లో తనతో పాటు మరో నటుడు బాలాజి కూడా ఉండటం విశేషం. అయితే ముందే గమనించిన జివి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారట.. రాజేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నిక్కి గర్లాని, అవికా గోర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రొమాంటిక్ ఏ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
చిన్న గాయాలతో ఉన్న వీరు ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. తృటిలో తప్పిన ఈ పెను ప్రమాదాన్ని తలచుకుని యూనిట్ అంతా కంగారు పడ్డదని కోలీవుడ్ టాక్.