పవన్ కల్యాణ్ చుట్టూ రెండేళ్లు తిరిగి, అవకాశాన్ని అందుకొన్నట్టే అందుకొని చేజార్చుకొన్నాడు సంపత్ నంది. లేదంటే ఈపాటికి సర్దార్ గబ్బర్ సింగ్‌కి దర్శకుడి హౌదాలో కెప్టెన్ కుర్చీలో కూర్చోవాల్సింది నంది. ఆ అవకాశం బాబికి వచ్చింది. అయితే అప్పుడు పవన్ చుట్టూ ఎంత తిరిగాడో.. ఇప్పుడు రామ్‌చరణ్ చుట్టూ అంతలా తిరుగుతున్నాడు సంపత్. వీరిద్దరి కాంబినేషన్లో ఇది వరకు రచ్చ వచ్చింది. మా గొప్ప సినిమా ఏం కాదుగానీ.. బాక్సాఫీసు దగ్గర మాత్రం బాగానే నిలబడగలిగింది. అప్పుడే చోటా మేస్త్రీ అంటూ మరో లైన్ చరణ్‌కి వినిపించాడు సంపత్. అదిగో.. అప్పట్నుంచి చరణ్‌ని పట్టుకొని వదలడం లేదు.
బెంగాల్ టైగర్ ముందు కూడా చరణ్ తో సంప్రదింపులు జరిగాడు సంపత్. కానీ వర్కవుట్ అవ్వలేదు. బెంగాల్ టైగర్ తరవాత వెంటనే చరణ్ దగ్గర వాలిపోయాడు. ఒకవేళ తని వరువన్ లేకపోతే.. సంపత్ తో సినిమాని పట్టాలెక్కించేవాడు చరణ్. కానీ.. కాన్ట్ బట్ పొజీషన్లో తని ఒరువన్ సినిమా చేయాల్సివచ్చింది. అందుకే ఆ సినిమా తరవాతైనా.. నా ప్రాజెక్టును ముందుకు కదిలించండి.. అంటూ చరణ్ చుట్టూ తిరగడం మొదలెట్టాడు సంపత్ నంది. చోటా మేస్త్రీ కథ చరణ్‌కి నచ్చలేదని, అది మొహం మీద చెప్పలేక.. ఇలా తిప్పించుకొంటున్నాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే… చరణ్ చెప్పిన మార్పులన్నీ చేసి, తనకు నచ్చేంత వరకూ స్ర్కిప్ట్ పై కూర్చుంటానని సంపత్ చెబుతున్నాడట. చూస్తుంటే.. చరణ్ ఓకే అనేంత వరకూ ఈ కుర్ర దర్శకుడు వదిలేలా లేడు. ఏం జరుగుతుందో చూడాలి.