ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇవ్వాళ్ళ, రేపు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిపి, వైకాపా అభ్యర్ధన మేరకు దానిపై రేపు సభలో ఓటింగ్ జరుగబోతోంది. కనుక తెదేపాలో చేరిన 8మంది వైకాపా ఎమ్మెల్యేలకు, త్వరలో చేరనున్న జ్యోతుల నెహ్రూ, వి.సుబ్బారావుతో సహా అందరూ తప్పనిసరిగా ఈ రెండు రోజులు శాసనసభకు హాజరయ్యి ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైకాపా విప్ జారీ చేసింది. కానీ జ్యోతుల నెహ్రూ, వి.సుబ్బారావుతో సహా తెదేపాలో చేరిన ఆ 8మంది వైకాపా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వాళ్ళ శాసనసభకు హాజరు కాకుండా పార్టీ విప్ ని ధిక్కరించారు. బహుశః రేపు కూడా వారు సభకు హాజరవకపోవచ్చునని భావించవచ్చును. వైకాపా కూడా అదే కోరుకొంటోంది కనుక వారందరిపై అనర్హత వేటు వేయాలని గట్టిగా పట్టుబట్టవచ్చును. దానికి ఎలాగూ స్పీకర్ అంగీకరించరు కనుక గవర్నర్ ని కల్సి వినతి పత్రం ఇవ్వడం, తరువాత కోర్టులో పిటిషన్ వేయడం వంటి తతంగం అంతా షరా మామూలే.