దిల్‌రాజు ప్లానింగ్ అంటే.. అద్భుతం అమోఘం అనుకొనేవాళ్లంతా. ఆయన పట్టిందల్లా.. హిట్టే. రాజు జడ్జిమెంట్‌కి తిరిగులేదన్నది కేవలం అభూత కల్పనే అని, ఆయనా పరమ చెత్త సినిమాలు తీస్తాడన్న విషయాన్ని కృష్ణాష్టమి చిత్రం మరోసారి నిరూపించింది. అటు సునీల్, ఇటు దిల్‌రాజు ఈ సినిమాపై గండెడాశలు పెట్టుకొన్నారు. టెక్నికల్ గా స్ట్రాంగ్ టీమ్‌ని పెట్టుకొన్నా, రొటీన్ కథతో తెరకెక్కించిన కృష్ణాష్టమి దారుణంగా నిరాశ పరిచింది. ఈ సినిమా తొలిరోజే ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
రూ.15 కోట్లతో ఈ సినిమా తెరకెక్కించాడు దిల్‌రాజు. టోటల్‌గా వరల్డ్ వైడ్ కలక్షన్లు చూసుకొంటే రూ.7 కోట్లకు మించి రాలేదు. అదీ… గ్రాస్. షేర్ లెక్కగడితే.. రూ.5 కోట్లు కూడా లేదు. శాటలైట్ కోటిన్నర వేసుకొన్నా, అరున్నర కోట్ల దగ్గర ఆగిపోతుంది. దిల్‌రాజు కొన్ని ఏరియాలకు సినిమా అమ్ముకొన్నా, చాలా చోట్ల ఓన్ రిలీజ్ చేశాడు. కొన్నవాళ్లు సగానికి సగం పోగొట్టుకొంటే.. దిల్‌రాజుకీ అలానే జరిగింది. దాదాపు 7 కోట్లు.. ఈసినిమాతో క్షవరమైంది. చిన్న సినిమాల్ని నమ్ముకొన్నప్పుడు దిల్‌రాజుకి ఇంత భారీ నష్టం ఎప్పుడూ రాలేదు. సునీల్ మాత్రం… మొత్తం ఊడ్చేశాడు.