బాహుబలి మొదటి పార్ట్ లో ఎన్నో ప్రశ్నలకు రాజమౌళి సమాధానం ఇవ్వకుండానే ప్రేక్షకుల ఆలోచనలకు పదును పెట్టేలా అర్ధాంతరంగా ఆపేశాడు. అయితే బాహుబలి కంక్లూజన్ రావడానికి ఈ సినిమా జనాల్లో నానేలా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే ప్రశ్నను అన్ని తరగుల వారికి తెలియని విధంగా కన్ ఫ్యూజ్ చేశాడు. దీని గురించి ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పుకొస్తుంటే తాజాగా బాహుబలి జాతీయ ఉత్తమ చిత్రంగా ఎన్నికైన సందర్భంగా బాహుబలి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ మరో ప్రశ్నను ప్రేక్షకుల మీదకు సంధించాడు.
రెగ్యులర్ గా అడిగేదే అయినా బాహుబలి అవార్డ్ పొందిన సందర్భంగా మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజేంద్రప్రసాద్ ను అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడని అడుగగా.. కట్టప్ప బాహుబలిని చంపాడని ఎందుకనుకుంటారు..? అసలు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటారు..? అంటూ కొత్త సమాధానం చెప్పాడు. అంటే ప్రశ్న ప్రశ్నగానే ఉంది కాని ఇప్పుడు మరో ప్రశ్న అదేంటంటే అసలు బాహుబలి చనిపోయాడా..? లేదా..? అని అందరు బుర్రలో హీటెక్కేలా ఆలోచిస్తున్నారు.. మరి ఇది తెలియాలంటే ఏప్రిల్ 17, 2017 దాకా వెయిట్ చేయాల్సిందే మరి.