ఓ సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ కి వచ్చే క్రేజ్ వేరు.. అయితే తీస్తున్న సినిమాల్లానే అలాంటి ఆఫర్లు వస్తాయనుకోవడం పొరపాటే.. హీరోయిన్స్ అన్నాక కాస్త పట్టు విడుపులుండాలి. కేవలం లక్షమైన పాత్రల్లోనే నటిస్తా అంటే దర్శక నిర్మాతలు ఒప్పుకున్నా ప్రేక్షకులు అంగీకరించరు. అందుకే సినిమా సినిమాకు హీరోయిన్స్ డోస్ పెంచుతూ వస్తుంటారు. కాని నందిత మాత్రం మొదట సినిమాలో ఎలా ఉందో లాస్ట్ ఇయర్ వచ్చిన శంకరాభరణంలో కూడా అలానే ఉంది.
అయితే ఎందాకని హోమ్లీగా చూస్తారు అంటూ తన గురించి తానే చెప్పుకొచ్చింది నందిత.. అవకాశం వస్తే హాట్ హాట్ గా అదరగొట్టేస్తా అంటుంది. స్టార్ హీరోల సినిమాల్లో స్కిన్ షో తప్పనిసరి అయితే అలాంటి ఆఫర్స్ వస్తే తాను కూడా అలా చేయడానికి రెడీ అంటుంది అమ్మడు. ప్రస్తుతం ఏప్రిల్ 1న ‘సావిత్రి’తో నారా రోహిత్ తో పాటుగా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న నందిత, సావిత్రి సినిమా తనకు చాలా ప్రత్యేకమైనదని.. సినిమా కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందని నమ్మకంగా చెబుతుంది. టీ నీకు నాకు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నందిత ప్రేమకథా చిత్రం సినిమాతో ప్రేక్షకుల్లో ఓ క్రేజ్ ను సంపాదించింది. మరి సావిత్రి అయినా నందిత కోరికను నేరవేరుస్తుందో లేదో చూడాలి.