తన కెరీర్లో తొలిసారి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది తమన్నా. కె.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవా కీలక పాత్రధారి. కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగులో ఇప్పుడు టైటిల్ కూడా ఖారారు చేశారు. అభినేత్రి అనే పేరుని తెలుగు కోసం ఫిక్స్ చేశారని సమాచారం. తమిళ, హిందీ టైటిళ్లను త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఈ సినిమాపై తమన్నా చాలా ఆశలు పెట్టుకొంది. ఎందుకంటే కథానాయిక ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడం తనకు ఇదే తొలిసారి. ఇలాంటి చిత్రాల్లోనూ మెప్పించగలని తమన్నా రుజువు చేసుకోవాలంటే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. దానికి తోడు హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకొనే మరో అవకాశం ఇది. అంతకు ముందు హిమ్మత్ వాలాలో కనిపించి, అందాలు ఆరబోసినా తమన్నాని పెద్దగా పట్టించుకోలేదు హిందీ జనాలు. దానికితోడు ఆ సినిమా పెద్ద ఫ్లాప్. ఫ్లాప్ హీరోయిన్ అనే ముద్రపోవాలంటే ఈ అభినేత్రి అద్భుతం చేయాల్సిందే.