నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి సంబంధించిన పనులన్నీ చకచక సాగుతున్నాయి. కథానాయికగా నయనతార ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయినట్టే. మరో కథానాయిక కోసం అన్వేషణ సాగుతోంది. స్ర్కిప్టు పనులు కూడా దాదాపుగా కొలిక్కి వచ్చేసినట్టే. ఇప్పుడు.. సాంకేతిక నిపుణుల జాబితా కూడా సిద్ధమవుతోంది. తొలిపేరు.. సంగీత దర్శకుడిగా దేవిశ్రీని ఖరారుచ చేసినట్టు సమాచారం. బాలయయ – దేవిశ్రీ కాంబినేషన్లో తొలి సినిమా లెజెండ్. అందులో బాలయ్య శైలికి తగ్గట్టుగానే మాస్ బాణీలిచ్చి.. అదరగొట్టాడు దేవిశ్రీ. అందుకే బాలయ్య చూపు దేవి వైపు మళ్లిందని తెలుస్తోంది. క్రిష్‌తో దేవిశ్రీ పనిచేయడం కూడా ఇదే తొలిసారి.
ఆర్.ఆర్కి ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా కావడంతో ముందు మణిశర్మని తీసుకొందామనుకొన్నారు. కానీ… మణి ఫామ్‌లో లేకపోవడం బాలయ్య బృందాన్ని కలవరపెట్టింది. అందుకే… ప్రయోగాలకు పోకుండా.. దేవిశ్రీ కే ఓటు వేసినట్టు సమాచారం. ఉగాది రోజున బాలయ్య సినిమాకి సంబంధించిన తొలి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆ రోజున నటీనటులు, సాంకేతిక వివరాల పేర్లు ప్రకటిస్తారు.