ఏప్రిల్ 1 నుండి 10వ తేడీ వరకు హైదరాబాద్ లో ఆస్ట్రేలియా చిత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు.. ఆస్ట్రేలియా కాన్సులేట్ జనరల్ సియాల్ కెల్లి ఈ చిత్రోత్సవం ఎలా జరుగనున్నాయో వెళ్లడించారు. ఆస్కార్ కు నామినేట్ అవుతున్న ఆస్ట్రేలియా సినిమాల ప్రదర్శనతో అక్కడ టెక్నాలజీ విశేషాలను విశ్లేషించుకునే అవకాశం ఉందని అన్నారు. బారత దేశ సినిమా ప్రపంచ సినిమాకు పోటీ ఇస్తుందని ముఖ్యంగా సౌత్ సినిమాలు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని ప్రశంసించారు. రేపటి నుండి జరుగనున్న ఈ చిత్రోత్సవాల్లో తొలిరోజు ప్రారంభ కార్యక్రమాలు మాత్రమే జరుగుతాయని.. రెండో రోజు నుండి సినిమాల ప్రదర్శన జరుగనున్నదని తెలిపారు.
కూకట్ పల్లిలోని సుజనామాల్ లో ఈ చిత్రోత్సవం నిర్వహించానున్నారు నిర్వాహకులు. పది రోజుల పాటు పది సినిమాలు ప్రదర్శితమవుతాయని.. ఈ చిత్రాల ప్రదర్శన ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారని తెలుస్తుంది. ఇక ప్రారంభ కార్యక్రమానికి సిని పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.