సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ నేపధ్యం లో అనేక సినిమా లు వచ్చిన, మళ్ళి మళ్ళి అదే జోనర్ లో తీస్తూనే ఉంటాడు వర్మ. తాజాగా మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రలలో ‘ఎటాక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని గతంలోనే విడుదల చేయాలని భావించిన, పలు కారణాల వలన అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ‘కిల్లింగ్ వీరప్పన్’ తర్వాత వర్మ నుంచి అందించిన ఈ సినిమా ను ప్రేక్షకులను మెప్పించిందా..? బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని అందుకుందా.? లేదా.? అన్నది సమీక్ష లో చూద్దాం..
కథ :
సాదా సీదా రివెంజ్ డ్రామా కథతో మన ముందుకు వచ్చిన ఈ చిత్రం కథగా చెప్పడానికి ఏమి లేదు. గురురాజ్ (ప్రకాష్ రాజ్) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. పెద్దవాడు కాళి (జగపతి బాబు), రెండవ వాడు గోపి (వడ్డే నవీన్), మూడవవాడు రాధా (మంచు మనోజ్). గతం లో గురురాజ్ కి కొంతమందితో తగాదాలు ఉన్నప్పటికినీ వాటిని మరచిపోయి తన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఓ సారి ఓ ల్యాండ్ తగాదా పై ఒకతని తో మాట్లాడి వస్తుండగా కొంతమంది కలిసి అతనిపై ఎటాక్ చేసి హత్య చేస్తారు. తరువాత ఆ హత్య వెనుక ఉన్న కారణం కనుక్కునే లోపే కాళి (జగపతి బాబు) ని కూడా చంపేస్తారు. ఈ హత్యల వెనుకున్న కారణం ఏంటి? ఈ మర్డర్స్ ఎవరు చేశారు అన్నది గురురాజ్ మూడవ కొడుకైన రాధా ఎలా కనుక్కున్నాడు? తన నాన్న, అన్న లను చంపిన వారిని ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.
నటి నటుల పెర్ఫార్మన్స్:
సినిమాలో ముఖ్య పాత్రలు చేసిన ప్రకాష్ రాజ్, జగపతి బాబు, వడ్డే నవీన్, తమ పాత్రలకు న్యాయం చేసారు. ముఖ్యంగా సినిమాలో మంచు మనోజ్ నటన గురించే చెప్పుకోవచ్చు. తొలిసారిగా మంచు మనోజ్ గడ్డంతో ఫుల్ మాస్ పాత్రలో ప్రేక్షకులని మెప్పించాడని చెప్పొచ్చు. తన నటనలో, డైలాగ్ డెలివరీలో పరిపక్వత కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎపిసోడ్ లో మనోజ్ పెర్ఫార్మన్స్ అదరగొట్టాడు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ’సత్తు’ గా నటించిన అభిమన్యు సింగ్ గురించి.. మెయిన్ విలన్ గా చేసిన సింగ్ తన పెర్ఫార్మన్స్ తో మంచు మనోజ్ కి గట్టి పోటీనే ఇచ్చాడు. ఇక బ్యూటిఫుల్ సురభి కి ఉన్నది చిన్న పాత్రే అయినా తన అందంతో ఉన్నంతలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటిగా కూడా ఓకే అనిపించుకుంది. పూనం కౌర్ తన అందాలను చూపడానికి ట్రై చేసింది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకి కెప్టెన్ అయిన రామ్ గోపాల్ వర్మ గురించి… కొత్తగా చెప్పేది ఏమి లేదు ఈ టైపు సినిమా లు చాల తీసాడు. అయితే ఆయన ’ఎటాక్’ సినిమా కోసం ఎంచుకున్న కథాంశం చాలా పాతది. కనీసం కథాంశానికి కొత్త ట్రీట్ మెంట్ కానీ, సన్నివేశాలు కానీ రాసుకుని ఉంటే బావుండేది. ప్రతి సీన్స్ చాలా రెగ్యులర్ గా ఉండడంతో ప్రేక్షకులని ని మెప్పించలేకపోయింది. వర్మ వద్ద వున్నా గొప్ప టాలెంట్ ఏటంటే..? దర్శకుడిగా నటుల నుంచి మంచి నటన రాబట్టుకోగలుగుతాడు. సాంకేతిక విభాగంలో అన్ని డిపార్ట్ మెంట్స్ నుండి వర్క్ పిండుకుంటాడు. అయినా సరే ఆద్యంతం ప్రేక్షకులను కూర్చో బెట్టలేక పోయాడు. ఇక కెమెరా వర్క్ బాగానే ఉంది. శేషు కె.ఎం.ఆర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగా ఉంది. అన్సర్ అలీ ఎడిటింగ్ చెప్పుకోదగ్గ స్థాయిలోలేదు. కళా దర్శకుడి పనితనం బావుంది.
విశ్లేషణ :
కథ చిన్నదైనా రాసుకున్న కథనంలో సన్నివేశాలలోని ఎమోషన్స్ ని పర్ఫెక్ట్ గా చూపగలిగితే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. కానీ ఈ సినిమా కథనంలో అనేదే మచ్చుకైన కనిపించదు. కథాంశం చిన్నదై ఎక్కువ పాత్రలు ఉండటం తో కథ అర్థం చేసుకోవడంలో ప్రేక్షకుడికి స్పష్టత లేకుండా పోయింది. ఇక కథలో గానీ, కథనంలో గానీ ఆడియన్స్ ని థ్రిల్ చేయడానికి గాని, వారు ఊహించలేని అంశాలు గాని, లేకపోవడంతో సినిమా సింపుల్గా తేలిపోయినట్టు సాదా సిదాగా వుంది. టైటిల్ పరంగా ’ఎటాక్’ అనే ఆసక్తి కలిగించినా, సాదా సీదా రివెంజ్ డ్రామా కథతో మన ముందుకు వచ్చిన రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులలో ఆసక్తి కలిగించడంలో మరోసారి విఫలం అయ్యాడు. మొదటి సన్నివేశం నుంచే ఏ సన్నివేశం లోనూ తనేం చెబుతున్నాడో అన్న విషయం గురించి స్పష్టత ఉండకపోవడం తో ప్రేక్షకులు ఈ సినిమాతో కనెక్ట్ అవ్వలేదు. సినిమా పరంగా సెకండాఫ్ పెద్ద మైనస్.. ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోయినా సెకండాఫ్ లో మాత్రం అస్సలు ముందుకు వెళ్ళదు. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ని మరీ సాగదీసినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా లో ఎంటర్టైన్మెంట్ అనేది అస్సలే లేదు. చివరాఖరు చెప్పెదేటంటే ’ఎటాక్’ అంటూ ఆసక్తి తో వచ్చిన వర్మ మరోసారి ప్రేక్షకులను పూర్తి స్థాయిలో మెప్పింలేకపోయాడు.
తెలుగు360.కామ్ రేటింగ్ 2/5
బ్యానర్ : సి కె ఎంటర్టైన్మెంట్,
నటి నటులు : మంచు మనోజ్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ ,వడ్డే నవీన్,అభిమన్యు సింగ్, సురభి, పూనం కౌర్,నర్సింగ్ యాదవ్ తది తరులు….
సంగీతం : శేషు కె.ఎం.ఆర్
నిర్మాత : సి కళ్యాణ్,
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
విడుదల తేది : 01.04.2016