పవన్ కల్యాణ్ సినిమాకి దర్శకత్వం వహించడం అంటే మామూలు విషయం కాదు. అదీ తన రెండో సినిమాకే ఆ అవకాశం దక్కించుకొంటే అదృష్టవంతుడే అనుకోవాలి. కానీ.. బాబీ విషయంలో సీన్ రివర్స్ అయ్యింది. ‘సర్దార్ – గబ్బర్ సింగ్’ లాంటి క్రేజీ ప్రాజెక్ట్‌లో ఆఫర్ దక్కించుకొన్నా.. ఆసినిమాకి దర్శకుడు అనిపించుకొన్నా, బాబిపై ఎన్ని రూమర్లో. అసలు ఈసినిమాకి బాబి దర్శకుడు కాదని, అతని పేరు మీద పవన్ అంతా నడిపిస్తున్నాడని, ఈ సినిమాకి ఇద్దరు ముగ్గురు దర్శకులు ఉన్నారని, బాబి కేవలం నిమిత్తమాత్రుడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై బాబి స్పందించాడు.
పవన్ కల్యాణ్‌తో సినిమా అంటే… ఇలాంటి గాసిప్పులు రావడం మామూలే అని. తాను ఏనాడూ ఇలాంటి న్యూసులను పట్టించుకోలేదని అంటున్నాడు బాబి. పవన్ కల్యాణ్ ఇచ్చిన స్వేచ్ఛ అంతా ఇంతా కాదని, ఓ కొత్త దర్శకుడు అని చూడకుండా తనని బాగా ఎంకరేజ్ చేశారని, పవన్ ఏ విషయంలోనూ అస్సలు జోక్యమే చేసుకోలేదని అంటున్నాడు బాబి. ఈసినిమాకి నేనే దర్శకుడ్ని అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. పవన్‌తో సినిమా చేయడం తన అదృష్టమని, వీలైతే చిరంజీవితో కూడా ఓ సినిమా చేస్తానని అంటున్నాడు బాబి. సర్దార్ ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈసినిమాతో బాబి రేంజ్ ఏ విధంగా మారుతుందో చూడాలి.