హిందిలో బాలికా వధు తెలుగులో చిన్నారి పెళ్లి కూతురులో ఆనంది పాత్ర చేసిన ప్రత్యూష బెనర్జి ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. ముంబై బంగూర్ నగర్ లోని ఆమె నివసిస్తున్న ఇంట్లో శుక్రవారం ఆమె ఉరివేసుకుని చనిపోయినట్టు సమాచారం. ఆమె ఎందుకు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ కారణాలేవి తెలియలేదు. కొంతకాలంగా సహనటుడు రాహుల్ రాజ్ సింగ్ తో ప్రేమ వ్యవహారాలు నడిపిన ప్రత్యూష ఇబ్బందులు పడుతుందని సమాచారం.
ఆమె చనిపోయే నిమిషం ముందు కూడా నిన్ను చూడకుండా ఉండలేను.. అంటూ వాట్స్ అప్ చేసి చనిపోవడం జరిగింది. ఝార్ఖండ్ కు చెందిన ప్రత్యూష చిన్నారి పెళ్లి కూతురులో ఆనందిగా అవికార్ గోర్ తర్వాత నటించింది. అయితే 2013 నుండి ఆమె ఆ సీరియల్ నుండి తప్పుకోవడం జరిగింది. అంతేకాదు ‘బిగ్ బాస్-7′, ఝలక్ దిఖ్ లాజా -5’ లాంటి రియాలిటీ షోస్ లో కూడా ఆమె పాటిస్పేట్ చేసింది. కొన్నాళ్లుగా ‘హమ్ హై నా’ షోలో కూడా కనిపించి అలరించిన ఆమె మరణం ప్రేక్షక హృదయాలను గాయపరచింది.