రీమేక్ కథల్లో ఓ సౌలభ్యం ఉంది. డీవీడీ ముందరెట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా తీసేసినా చల్తా. కానీ.. మాతృకలోని ప్లస్సుల్ని పట్టుకొని, మైనసుల్ని ప్లస్సులుగా మార్చుకొంటే మాత్రం ఫలితం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అలా జరగాలంటే సొంత బుర్ర వాడాలి. దర్శకుడు తన తెలివితేటలకూ పదునెట్టాలి. అయితే.. చాలామట్టుకు రీమేకులన్నీ కట్, కాపీ పేస్ట్ లే. ఇప్పుడు తని ఒరువన్ విషయంలోనూ అదే జరుగుతోందని టాక్.
తమిళ సినిమా తని ఒరువన్‌ని రామ్ చరణ్ కోసం తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. చిత్రీకరణ శర వేగంగా సాగుతోంది. అయితే సురేందర్ రెడ్డి.. తని ఒరువన్లో ఏమున్నదో యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోతున్నాడట. కాస్ట్యూమ్స్, డైలాగ్స్ తో సహా.. దేన్నీ మార్చడం లేదని తెలుస్తోంది. ఇదంతా.. చరణ్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగే అని తెలుస్తోంది. ఉన్నది ఉన్నట్టు తీయ్.. సొంత బుర్ర వాడొద్దని సురేందర్ రెడ్డికి క్లియర్‌గా చెప్పేశాడట. అసలు కిక్ 2 దారుణ ఫ్లాప్ తో డీలా పడ్డాడు సురేందర్‌రెడ్డి.
తని ఒరువన్ కూడా ఆగిపోయేదే. తన అదృష్టం కొద్దీ పట్టాలెక్కింది. అందుకే చరణ్ ఏం చెప్తే అది చేసున్నాడట. అంటే.. మరోసారి కట్ కాపీ పేస్ట్ లాంటి రీమేక్ సినిమానిచూస్తామన్నమాట.