తమిళంలో విజయవంతమైన సేతుపతి సినిమా రీమేక్ రైట్స్ కోసం కొంతమంది తెలుగు నిర్మాతలు, కుర్ర హీరోలూ గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే ఆ రైట్స్ సందీప్ కిషన్‌కి దక్కాయి. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించేద్దాం అనుకొంటున్న తరుణంలో ఓ డౌట్ లాంటిది కొట్టేసింది. అసలు సేతుపతి కథకు తాను సెట్టవుతానా? లేదా?? అని ఆలోచించాడట. ఇదో మాస్ పోలీసోడి పాత్ర. దానికి తోడు.. ఆ పోలీసోడికి ఇద్దరు పిల్లలు. అలాంటి పాత్రల్లో నటించడానికి తనకున్న వయసు, అనుభవం సరిపోవని సందీప్ పీలవుతున్నాడట.
పొరపాటున ఈ సినిమా కొనేశానా?? అని ఇప్పుడు తీరిగ్గా బాధపడుతున్నాడట. రీమేక్ రైట్స్ ఎలాగూ తన దగ్గర ఉన్నాయి కాబట్టి.. మరో హీరోని పట్టుకొని ఈ సినిమాని పట్టాలెక్కిద్దాం, నిర్మాతగా తన పేరు చూసుకొందాం అని ఫిక్సయ్యాడట. సునీల్, రవితేజ పేర్లు ప్రస్తుతం సందీప్ దృష్టిలో ఉన్నాయి. సునీల్‌తో సందీప్‌కి మంచి రాపో ఉంది. సునీల్‌కి చెప్పి ఈ సినిమా ఎలాగైనా ఓకే చేయిద్దాం అనుకొంటున్నాడట. ఒకవేళ రవితేజ ఓకే అంటే.. ఆయనతో ప్రొసీడ్ అయిపోవాలని చూస్తున్నాడట. మరి ఇద్దరూ కాదంటే.. తన పరిస్థితి ఏంటి?? అందుకే రీమేక్ రైట్స్ కొనుక్కొనేటప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలమ్మా.. లేదంటే ఇలాంటి పరిస్థితులే వస్తాయి.