శ్రీజ పెళ్లి పనులు అయిపోయాయి. ఇక మెగా ఇంటి నుంచి అన్నీ సినిమా కబుర్లే. రామ్ చరణ్ తని ఒరువన్ షూటింగ్లో బిజీ అవ్వబోతున్నాడు. చిరంజీవి కూడా.. ఇప్పుడు 150వ సినిమాపై దృష్టి పెట్టాడు. ఈ సినిమా స్ర్కిప్ట్ ఆల్మోస్ట్ పూర్తి అవ్వొచ్చింది. కథానాయిక, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తారు. ఇప్పుడు చిరు బృందం…. టైటిల్పై కసరత్తు చేస్తోంది. తమిళ సినిమా కత్తికి రీమేక్ కాబట్టి ఈ సినిమాకి కత్తిలాంటోడు అనే టైటిల్ పెడితే బాగుంటుందన్నది చిత్రబృందం ఆలోచన.
ఈ విషయాన్ని చిరంజీవి కూడా చూచాయిగా అభిమానులతో ప్రస్తావించారు. శ్రీజ వివాహం అనంతరం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర్రాల్లో ఉన్న మెగా అభిమానులతో చిరంజీవి హైదరాబాద్లో ఓ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా.. 150వ సినిమా ప్రస్తావవ వచ్చింది. ఆ పనుల్లోనే తానూ బిజీగా ఉన్నానని, సినిమాకి కత్తిలాంటోడు అనే పేరు పరిశీలిస్తున్నానని చెప్పుకొచ్చారు. టైటిల్ మాసీగానే ఉండొచ్చు. కానీ… చిరంజీవి హోదాకు, ఆయన స్థాయికి, వయసుకీ ఈ టైటిల్ సరిపోతుందా అన్నది అనుమానమే. ఎంత రీమేక్ అయినప్పటికీ… టైటి్ల్ నుంచే కత్తి ఛాయలు పడిపోవాలంటే ఎలా?? ఈ విషయంలోనైనా కాస్త కొత్తగా ఆలోచించకపోయారా? ఎనీవే.. చిరంజీవి ఫ్యాన్స్కి మాత్రం ఈ టైటిల్ నచ్చొచ్చు. మిగిలిన వారి విషయంలో డౌటే.