హైదరాబాద్: పుష్కరాల చివరిరోజైన శనివారంనాడు నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ రాజమండ్రి వీఐపీ ఘాట్‌లో పుష్కరస్నానమాచరించారు. ప్రత్యేకపూజలు చేసి పితృదేవతలకు పిండప్రదానం చేశారు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి మాణిక్యరావుకూడా ఆయనవెంట ఉన్నారు. పుష్కరాలకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయని బాలయ్య అన్నారు.