ఈవాల్టి రోజుల్లో ఏ సినిమాకైనా ప్రమోషన్ అత్యవసరం. తొలి మూడు రోజుల్లోనే థియేటర్లోకి అందరినీ రప్పించేయాలి. ఓ వారం రోజుల్లో తట్టా బుట్టా సర్దేసుకుకోవాలి. అలా జరగాలంటే ప్రమోషన్లు భారీ ఎత్తున చేయాల్సిందే. సర్దార్ గబ్బర్ సింగ్‌కి కూడా పవన్ సినిమాలకు ఇది వరకెప్పుడూ లేనంతగా భారీ ప్రమోషన్లు చేస్తున్నారు. అయితే.. మీడియా ఇంటర్వ్యూలకు మాత్రం టీమ్ మొత్తం దూరంగా ఉంటోంది. బాబి ఒక్కటే ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కాజల్ ఇంత వరకూ బయటకు రాలేదు. శరత్‌మరార్ కూడా బిజీగా అటూ ఇటూ తిరుగుతున్నాడు తప్ప… మీడియాకి కనిపించడం లేదు. పవన్ సంగతంటారా సరే సరి. దేవిశ్రీ ప్రసాద్ రికార్డింగు థియేటర్లకే పరిమితమైపోయాడట. ఇలాగైతే సినిమా గురించి మాట్లాడేవాళ్లెవరు??
కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. ”మన సినిమా గురించి మనం గొప్పగా చెప్పుకోవడం ఎందుకు, సినిమా చూసి జనమే చెప్పుకోవాలి..” అంటున్నాడట. ప్రమోషన్ చేయకపోయినా.. మంచి సినిమా నిలబడుతుందని నమ్మకంతో చెబుతున్నాడట. పవన్ కాన్ఫిడెన్స్ చూసి… చిత్రబృందం మొత్తం సంబరపడిపోతోంది. ఈ కాన్ఫిడెన్స్ మంచిదే. కానీ సినిమా కాస్త అటూ ఇటూ అయితే మొదటికే మోసం వస్తుంది. బాలీవుడ్లో సర్దార్ని భారీగా రిజలీ చేస్తున్నారు. అక్కడ మాత్రం భారీ ప్రమోషన్లు ఇవ్వాల్సిందే. లేదంటే జనం పట్టించుకోరు. అక్కడ కూడా సర్దార్ కేవలం పోస్టర్లకీ ఫ్లెక్సీలకీ పరిమితమైపోతున్నాడు. అలాంటప్పుడు టికెట్లు తెగడం కష్టమే అన్నది ఫిల్మ్‌నగర్ వర్గాల అభిప్రాయం. మరి సర్దార్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.